తగ్గేదే లే అంటున్న బిగ్ బాస్ బ్యూటీ.. కొంచెం తగ్గితే బాగుంటావ్ అంటూ ట్రోల్స్…!

స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది రాత్రికి రాత్రే స్టార్ గా గుర్తింపు పొందుతున్నారు. ఇలా యూట్యూబ్ వీడియోస్, డబ్ స్మాష్ వీడియోలలో ఆశు రెడ్డీ బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన శ్రీ రెడ్డి సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఆమెకు సినిమాల ద్వారా అంత మంచి గుర్తింపు లభించలేదు. తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేసిన ఆశు రెడ్డి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఆశు రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపింది.

వీరిద్దరి అఫైర్ కారణంగా ఆశు రెడ్డీ మరింత పాపులర్ అయ్యింది. అయితే రాహూల్ ఆ సీజన్ లో టైటిల్ దక్కించుకున్నాడు. ఆశు రెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి పలు టీవీ షోల్లో కనిపించింది. అప్పటి నుండి పలు టీవీ షోల్లో కనిపిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఆశు రెడ్డి ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా పాల్గొంది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకొని ఎలిమినేట్ అయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు రెడ్డి అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. ఆమె ఫోటోలు వీడియోలు చూసినా నెటిజన్లు మాత్రం ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఇలా ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో హంగామా చేసే ఆశు రెడ్డి ఇటీవల కూడా ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో అశు రెడ్డితో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసిన ఆశు రెడ్డి ఫోటో కింద తగ్గేదే లే అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు కొంచెం తగ్గితే బాగుంటావు అంటూ ట్రోల్ చేస్తున్నారు.