All Big Boss Telugu Season Winners: బిగ్ బాస్ అన్ని సీజన్ల విన్నర్ లు, వారు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

All Big Boss Telugu Season Winners: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారం అవుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్ లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇకపోతే మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ విజేతలుగా ఎవరు నిలిచారు.. వారు ఎంత ప్రైజ్ మనీ తీసుకున్నారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్లో నటుడు శివ బాలాజీ బిగ్ బాస్ విజేతగా నిలబడ్డారు. ఈయన 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకోవడమే కాకుండా ఎనిమిది లక్షల రూపాయల పారితోషికం అందుకున్నారు.రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్ లో కౌశల్ విజేతగా నిలిచారు. ఆయన యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ వెంకటేష్ చేతుల మీదుగా అందుకున్నారు.

బిగ్ బాస్ మూడవ సీజన్ వ్యాఖ్యాతగా నాగార్జున వ్యవహరించారు. ఈ సీజన్లో రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌గా గెలిచారు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకున్నారు. నాలుగవ సీజన్ వ్యాఖ్యాతగా నాగార్జున వ్యవహరించారు. ఈ సీజన్లో అభిజిత్ విన్నర్ గా నిలిచి 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక బైక్ బహుమతి గెలుపొందారు. ఇక ఐదవ సీజన్ విన్నర్ గా సన్నీ నిలిచారు. ఈయన 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు 25 లక్షల విలువచేసే సువర్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లాట్, ఒక బైక్ అదే విధంగా 30 లక్షల పారితోషికం తీసుకున్నారు.