Bigg Boss 9 Buzz Host: బిగ్ బాస్9 ప్రోమో రిలీజ్… హోస్ట్ గా నాగ్ ఓకే.. బజ్ హోస్ట్ ఎవరంటే?

Bigg Boss 9 Buzz Host: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. తాజాగా ఈ కార్యక్రమం 9వ సీజన్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే. ఆటలో అలుపు వచ్చినంత సులభంగా గెలుపు రాదని గెలుపు రావాలంటే పోరాటం చేయాలని చెప్పారు. ఈసారి బిగ్ బాస్ చదరంగం కాదు ప్రభంజనం అంటూ ఈయన ఈ కార్యక్రమం పై అంచనాలు పెంచేశారు.

తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే గత కొంతకాలంగా ఈ సీజన్ కు నాగార్జున హోస్ట్గా వ్యవహరించారని ఆయన స్థానంలో విజయ్ దేవరకొండ లేదా బాలకృష్ణ వంటి వారు రాబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి చూస్తుంటే ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా రాబోతున్నారని స్పష్టత వచ్చింది. ఇలా ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ ఓకే కానీ మరి బజ్ హోస్ట్ ఎవరు అనేదానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ప్రతి సీజన్ కు బిగ్ బాస్ బజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 బజ్ కార్యక్రమానికి హోస్టుగా గత సీజన్ లేడీ కంటెస్టెంట్ ప్రేరణ రాబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ప్రేరణ గత సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనటమే కాకుండా హౌస్ లో ఉన్న వారందరికీ కూడా గట్టి పోటీ ఇస్తూ టాప్ 5 లో ఉన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రేరణ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఈమె హోస్టుగా వ్యవహరించబోతున్నారని సమాచారం.