బిగ్ బాస్ 6 ప్రారంభమయ్యేది అప్పుడే.. మై విలేజ్ షో నుంచి ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్?

బుల్లితెర ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ లను ఎంపిక చేస్తారు.ఈ క్రమంలోనే ఇదివరకు ప్రసారమైన ఎన్నో సీజన్లలో ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయినటువంటి వారిని ఎంపిక చేశారు.ఇకపోతే సీజన్ సిక్స్ లో భాగంగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారితో పాటు ఒక కామన్ ఎంట్రీ కూడా ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇకపోతే సీజన్ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నుంచి గంగవ్వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమంలో కూడా మై విలేజ్ షో నుంచి కంటెస్టెంట్ గా ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని,ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ వీళ్ళే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ, బిగ్ బాస్ హౌస్ సెట్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో ప్రసారం కానుందని వార్తలు పెద్దఎత్తున వినబడుతున్నాయి.సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుందని సమాచారం.ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా నాన్ స్టాప్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.