Big Boss 5 Telugu: బిగ్ బాస్ లీక్.. బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న సన్నీ.. ఎన్ని ఓట్లు నమోదయ్యాయో తెలుసా?

Big Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరొక రోజులో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ విజేత ఎవరు అంటూ మొదటి నుంచి పెద్ద ఎత్తున ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ సీజన్ విజేత సన్నీ అంటూ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.బిగ్ బాస్ టైటిల్ రేసులో సన్నీ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో షణ్ముఖ్ ఉన్నారు. వీరిద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉందని, సన్నీ టైటిల్ అందుకోబోతున్నారని గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రతి వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందుగానే మనకు తెలిసిపోతుంది.ఈ క్రమంలోనే ఆ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి ఆ వార్తలు వచ్చిన విధంగానే అదే కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రేపటితో ముగిస్తుండగా విజేత ఎవరో తెలిసిపోయింది.

బిగ్ బాస్ విజేతగా మొదటి నుంచి ఎవరి పేరు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందో అతనే విజేత అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ రన్నర్ గా నిలవగా… సన్నీ బిగ్ బాస్ విజేతగా నిలిచారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అధికారికంగా ఓట్లు చూస్తే సన్నీ 34 శాతం ఓట్లు దక్కించుకుని మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సన్నీ ఈ సీజన్ ట్రోఫీని అందుకున్నారు. ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ జర్నీ చూపించే సమయంలో సన్నీ యువర్ టైం ఆగయా అంటూ పరోక్షంగా బిగ్ బాస్ తనకు హింట్ ఇచ్చారని తెలుస్తోంది.