టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ రాసిన కథతో తెరకెక్కింది ఏటీఎం వెబ్‌సీరీస్. బిగ్‌బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ కూడా ఈ సీరీస్‌తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. ఏటీఎం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఇవాళ ఆవిష్కరించారు.
సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న వెబ్‌సీరీస్ ఇది. డీజే, గబ్బర్‌సింగ్ చిత్రాల ఫేమ్ హరీష్‌శంకర్ స్టార్ షో రన్నర్. జీ5 ఈ వెబ్‌సీరీస్‌ని తీసుకుంది. దోపిడీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. జనవరి 20 నుంచి జీ5లో ప్రసారమవుతుంది.
గద్దలకొండ గణేష్ డైరక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ “దోపిడీ జోనర్‌లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. పిల్లీ ఎలుకా గేమ్‌లాగా ఉంటుంది. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం“ అని అన్నారు.
పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు“ అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. వీజే సన్నీ, కృష్ణ, రవిరాజ్, రాయల్ శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సి.చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చారు.