Sreerama Chandra: బిగ్ బాస్ సీజన్ పై కార్యక్రమంలోకి సింగర్ గా అడుగుపెట్టిన శ్రీ రామచంద్ర గురించి మనందరికీ తెలిసిందే. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా కొనసాగడమే కాకుండా ఇండియన్ ఐడల్ 5 టైటిల్ ను సొంతం చేసుకుని ఎంతో ప్రేక్షకాదరణ పొందారు.అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా టాప్ ఫైవ్ లో ఉండి మరింత పాపులారిటీని దక్కించుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో సెకండ్ రన్నర్ గా నిలిచిన శ్రీరామ చంద్ర బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో శ్రీ రామచంద్ర తన పెళ్లి గురించి ఎంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి తనకు పెళ్లి చేయాలని ఇంట్లో ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నారని ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర తన పెళ్లి గురించి బయటపెట్టారు. అయితే తనకు ఎలాంటి అమ్మాయి కావాలి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.
తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి అనే విషయం గురించి పెద్దగా సెలక్షన్స్ ఏమి లేకపోయినప్పటికీ తనని తన తల్లిదండ్రులను ఫ్యామిలీని మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలని ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో శ్రీరామచంద్ర క్లారిటీ ఇచ్చారు. మరి ఈయన మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడ ఉందో ఎప్పుడు తనకు ఎదురై వీరి వివాహం జరుగుతుందో వేచి చూడాలి.