లోకేష్‌ను ఎమ్మెల్యేను చేయడం బాబు వల్ల కాలేదు.. నువ్వైనా చేయగలవా అన్నా ?

Big task for acham naidu

తనయుడు లోకేష్‌ను పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు.  తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసిన బాబుగారు 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేని చేయలేకపోయారు.  కాచి వడపోసి, ఎన్నో సమీకరణాలను చూసుకుని మంగళగిరి నుండి చినబాబును పోటీకి దింపితే ఓడిపోయారు.  ఇదొక్కటే కాదు.. గత ఎన్నికల్లో బాబు అనుకున్నది ఒక్కటి కూడ జరగలేదు.  అన్ని విషయాల్లోనూ పరాజయాలే.  పార్టీగా టీడీపీకి ఓటమి కొత్త కాదు.  కానీ రాజకీయ నాయకుడిగా, చంద్రబాబు కుమారుడిగా లోకేష్‌కు మాత్రం గత ఎన్నికలు దారుణమైన పరాజయం. 

Big task for acham naidu
Big task for acham naidu

టీడీపీ ఓడిందనే విమర్శల కంటే కొడుకుని గెలిపించుకోలేకపోయాడనే చిన్నచూపు చంద్రబాబును విపరీతంగా వేధించింది.  త్వరలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించనున్నారు చంద్రబాబు.  త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.  పార్టీ అధ్యక్షుడు అంటే ఇక పార్టీ భాద్యత మొత్తం అతనిదే.  రాష్ట్రంలోని పార్టీలో అన్ని పరిణామాలకు వారే ఏకైక జవాబుదారు.  అంటే ఇకపై అచ్చెన్న మీద బరువు బాగా పెరుగనుంది.  ఓటమికి గల కారణాలు తెలుసుకోవడం, నియోజకవర్గాల్లో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను యాక్టివేట్ చేయడం, అంతర్గత విభేదాలును రూపుమాపి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా తయారుచేయడం. 

 

Nara Lokesh
Nara Lokesh

మామూలుగా అయితే ఏ అధ్యక్షుడికైనా ఇవే బాధ్యతలు.  కానీ అచ్చెన్నాయుడుకు మాత్రం వీటికి మించిన బాధ్యత వేరే ఉంది.  అదే.. నారా లోకేష్‌ను పైకిలేపడం.  అంటే… వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడం అన్నమాట.  ఈ పని చంద్రబాబు వలన కూడ కాలేదు.  ఆయనే చినబాబును జాకీలు పెట్టి మరీ పైకి లేపి లేపి అలసిపోయారు.  అలాంటి లోకేష్‌ను ఎమ్మెల్యేను చేయడం అంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చేసే కృషితో సమానమైన పని.  ఈ అరుదైన కార్యాన్ని గనుక అచ్చెన్న చేసి చూపిస్తే మాత్రం చంద్రబాబు అచ్చెన్నను దేవుడిలా చూస్తారు.  పార్టీలో నెంబర్ టూ పొజిషన్ ఇచ్చినా ఇచ్చేస్తారు.  చూడాలి మరి… అచ్చెన్నాయుడు లోకేష్‌ను ఎమ్మెల్యేను చేయగలరో లేదో.