బిగ్ టాక్ : “అవతార్ 2” కి ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాకి ఉన్న లింకేంటి..?

Avatar and Prabhas : ఎక్కడా జరగని చూడని వింతలు ఒక్క సినిమా మాత్రమే ప్రేక్షకుడికి చూపించి ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని గంటల పాటు వేరే లోకంలోకి తీసుకెళ్లే సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి భారీ సినిమాల్లో హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ అద్భుత సృష్టి అయినటువంటి “అవతార్” కూడా ఒకటి. అసలు ఇలాంటి సినిమా కూడా తీస్తారా అని ఆ సినిమాతోనే అందరికీ తెలిసింది.

అయితే ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వస్తుంది. దానిపై వచ్చిన టీజర్ ట్రైలర్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. అయితే మరి ఇలాంటి సినిమా మన ఇండియన్ సినిమా అయినటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆదిపురుష్” కి ఇపుడు సినీ వర్గాల్లో లింక్ కలపడం ఆసక్తిగా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిపోయింది. అయితే లేటెస్ట్ గా అవతార్ సినిమాతో పోలుస్తూ సినీ వర్గాల వారు కొన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వదులుతున్నారు.

మొదటి నుంచి కూడా ఆదిపురుష్ అనే సినిమా ఇండియా లోనే ఒక అతి పెద్ద విజువల్ వండర్ గా ఉండబోతుంది అని కేవలం ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే 300 కోట్లు పెడుతున్నారని టాక్ వచ్చింది. అయితే ఆ గ్రాఫికల్ వర్క్ నే మొత్తం అంతా కూడా అవతార్ సినిమాలకి వాడిన టెక్నాలజీనే ఈ ఆదిపురుష్ కూడా వాడారట.

దీనితో ఈ సినిమా లోని విజువల్స్ ని ఇప్పుడు అవతార్ సినిమాలతో పోలుస్తున్నారు. అందుకే ఇలా లింకప్ అయ్యిన ఈ రెండు చిత్రాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అవతార్ రేంజ్ లో విజువల్స్ చూపించడం అనేది చిన్న విషయం అయితే కాదు మరి ఈ సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి.