దిల్ రాజుకి బిగ్ షాకిచ్చిన తెలుగు చిత్ర నిర్మాణ మండలి.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలువురు స్టార్ ప్రొడ్యూసర్స్ లో అయితే నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. మరి డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయ్యి అలాగే నిర్మాత గా మారి ఈ టాప్ నిర్మాతగా మారాడు. అయితే నిర్మాతగా మారాక ఎలాంటి తెలివితేటలూ లేకుండా టాప్ స్థానానికి రావడం సాధ్యం కాదు. దీనితో తెలుగు సినిమాల వరకు తన సినిమాల వరకు కూడా ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడే తాను ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఎదుర్కొనే సమయం వచ్చింది.

తాను ఇప్పుడు తమిళ్ లో తెరకెక్కిస్తున్న చిత్రం “వరిసు” ని తెలుగులో కూడా గట్టిగా రిలీజ్ చేస్తునట్టు ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రం అయితే తమిళ్ లో ప్రియార్టీ ఇచ్చి తెలుగులో కూడా అంతే గ్రాండ్ గా మన తెలుగు స్ట్రైట్ సినిమాలకి థియేటర్స్ ఇవ్వకుండా చేస్తాడని ఆల్రెడీ ఓ టాక్ వచ్చేసింది. ఇక దీనితో అయితే ఈ చిత్రం విషయంలో దిల్ రాజు ఏదొక జిమ్మిక్ చేస్తాడని అంతా అనుకుంటుండగా టాలీవుడ్ సినిమా నిర్మాణ మండలి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక మేటర్ చూస్తే..

“తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఇందుమూలముగా తెలియజేయునది: తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని మరియు నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ది: 08-12-2017 తేదీన న జరిగిన అత్యవసర మీటింగులో, “సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది”.

మీడియా ఈ విషయమై, ప్రముఖ నిర్మాత మరియు ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ శ్రీ దిల్ రాజు గారు 2019 సంవత్సరంలో ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపర్చాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ స్ట్రెయి గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రథమ ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు “సంక్రాతి, దసరా పండుగలలో” కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎక్సిబిటర్స్’ ను (ప్రదర్శకులు కోరుచున్నాము.” అని  ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీనితో దిల్ రాజు రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.