చంద్రబాబుకు భారీ షాక్.. టీడీపీ పరిస్దితి ఇంత ఘోరమా.. ?

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయట.. ఇప్పటికే ప్రపంచానికి ఈ 2020 వ సంవత్సరం అంతగా కలసిరాలేదు.. అందులో చంద్రబాబుకు కూడా రాజకీయంగా అసలు బాగోలేదు.. ఇన్నాళ్ల తన రాజకీయ అనుభవం అంతా చెదలు పట్టినట్లుగా అయిపోయిందట.. ఒకవైపు టీడీపీ రానున్న రోజుల్లో కనుమరుగైపోతుందా అనే బెంగతో పాటుగా, పార్టీలోని నాయకులంతా ఒక్కక్కరుగా బాబుగారిని ఒంటరిని చేసి అధికార పార్టీలోకి లాంగ్ జంప్ చేస్తున్నారు.. ఇదీ చాలదన్నట్లుగా లోకం తెలియని లోకేశం రాజకీయ పాఠాలు అస్సలు వొంటపట్టించుకోవడం లేదు.. ఇక బాలయ్య బాబు బాలయ్య బాబే.. అంతా దబిడిదిబిడే కానీ పార్టీని బలపరచడంలో మాత్రం ఖాళీనే.. మరోవైపు అవినీతి ఆరోపణలు అన్ని చంద్రబాబుని చుట్టుముట్టగా ఇన్ని సమస్యల మధ్య సతమతం అవుతుంటే టీడీపీలోని నాయకులంతా సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా పెట్టాబేడా సర్దుకుంటున్నారు..

ఇలా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాగా ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా.. తాజాగా, మరో కీలక సీనియర్ నేత, దివంగత ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన, విజయనగరం జిల్లాకు చెందిన‌ మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇకపోతే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలో పరిస్థితులు బాగోలేవని, సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదని, ఆత్మ గౌరవం, ఆత్మస్థైర్యంతో పుట్టిన తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం కరుమరుగైందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

అసలే రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ పై గెలిచి మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవాలని కలలు కంటున్న బాబుకు, ఇలా పార్టీ నుండి వరుసగా వలసలు మొదలవడంతో, అధికారంలోకి రావడం అటుంచితే రానున్న కాలంలో టీడీపీలో చంద్రబాబు, లోకేశ్, బాలయ్య మాత్రమే మిగిలే పరిస్దితి ఉందని అనుకుంటున్నారట వైఎస్ జగన్ అభిమానులు, ప్రజలు.. ఏది ఏమైనా రోజు రోజుకు టీడీపీ పరిస్దితి ఇంత దారుణంగా మారడం వల్ల రానున్న రోజుల్లో చంద్రబాబు కొత్త వ్యూహంతో పార్టీని కాపాడుకుంటాడో లేక కనుమరుగైపోతాడో.. చూడాలి అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..