ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ మరియు సినిమాలు పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాము. బహుశా సినిమా వాళ్ళు కూడా పాలిటిక్స్ లో ఉండడం వల్లో ఏమో కానీ రాజకీయ నాయకులు పలువురు సినిమా వాళ్ళను టార్గెట్ చెయ్యడం లేదా సినిమా వాళ్ళతో టార్గెట్ చేయించడం వంటివి చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలు పాలిటిక్స్ లో బిజీగా ఉండగా ఎందుకో మరో పక్క ఇతర పార్టీల వారు మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ రాజకీయాల్లో లాగుతున్నారు. తాజాగా అయితే ఏపీలో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే, మినిష్టర్ అంబటి రాంబాబు పలు సంచలన కామెంట్స్ మీడియా ముఖంగా జూనియర్ ఎన్టీఆర్ పై చెయ్యడం షాకింగ్ గా మారింది.
దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ బేషరతుగా తమ హీరో ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున ఇండియన్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు. అలాగే దీనిపై టీడీపీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ కి మరి మద్దతుగా నిలబడతారా అని సూటి ప్రశ్నలు వేస్తున్నారు.
దీనితో అయితే ప్రస్తుతం అంతా కాస్త గరం గరంగానే ఉంది. ఇవేవి జగన్ కి తెలియకుండా ఉండవని జగన్ అయితే క్షమాపణ చెప్పి తీరాలని వారు పెద్ద ఎత్తున ఈ ట్రెండ్ లో పాల్గొంటున్నారు. అలాగే అంబటి కామెంట్స్ ని ఖండిస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తోడుగా ఇతర హీరోల అభిమానులు కూడా మద్దతు అందిస్తున్నారు.