Relief For Big Movies : గడిచిన ఏడాది కాలం నుంచి.. దాదాపు పదకొండు నెలల నుంచి ఏపీలో టికెట్ ధరల అంశం ఎలా నెలకొందో అందరికీ తెలిసిందే. అమాంతం టికెట్ ధరలను తగ్గించి కొత్త జివో లు రిలీజ్ చేసి ఇప్పటికీ నానా రభస గా టాలీవుడ్ మరియు ఏపీలో పరిస్థితులు మారిపోయాయి.
మరి ఇదిలా ఉండగా గత మూడు వారాలు కితం టాలీవుడ్ దిగ్గజ హీరోలు మరియు దర్శకులు వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి సమస్యలు విన్నచించి పరిష్కార మార్గం కోరారు. దీనితో సీఎం కూడా సానుకూలంగా స్పందించి కొత్త ధరలతో కొన్ని సినిమాలు కి మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే అది ఇంకా రాలేదు కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇండస్ట్రీలో బిగ్ న్యూస్ వినిపిస్తోంది. రాబోతున్న భారీ సినిమాలకి ఊరట ఇచ్చేలా కొత్త ధరలతో ఏపీ ప్రభుత్వం కొత్త జివో ని రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం చేశారట. మరి ఇది దాదాపు జస్ట్ ఈ రెండు మూడు రోజుల లోపే వచ్చేయొచ్చు అని సమాచారం వినిపిస్తోంది.
ఈ ధరల పైనే రానున్న రాధే శ్యామ్, ట్రిపుల్ ఆర్ తదితర భారీ చిత్రాలు ఎంతో ఆధారపడి ఉన్నాయి. మరి ఈ జివో ఎప్పుడు వస్తుందో చూడాలి.