Ajay Devgn : బిగ్ న్యూస్ : “RRR” స్టార్ నటుడిపై భారీ స్థాయిలో సోషల్ మీడియా వార్..!

Ajay Devgn : తాజాగా ఇండియన్ సినిమా దగ్గర దుమ్ము లేపిన పలు భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన క్రేజీ మల్టీ స్టారర్ ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా బాలీవుడ్ స్టార్ నటులు అజయ్ దేవగణ్ మరియు ఆలియా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ నటుల్లో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో మరియు నటుడు అజయ్ దేవగణ్ ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో ట్విట్టర్ వేదికగా కాసేపు గట్టి యుద్ధాన్నే తాను చేసాడు కానీ లాస్ట్ కి మాత్రం వాస్తవాల్లో తానే ఓటమి పాలయ్యాడు.
సినిమాల నుంచి జాతీయ స్థాయిలో భాషా సెంటిమెంట్స్ వరకు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం వెళ్ళింది. మన దేశ అధికారిక భాష హిందీ కాదని సుదీప్ హిందీ కాకపోతే మీ సినిమాలు ఎందుకు హిందీలో డబ్ చేస్తున్నారని అజయ్ కౌంటర్ ఇవ్వగా దీనికి అజయ్ దేవగణ్ పై సోషల్ మీడియా ఫాలోవర్స్ భారీ స్థాయిలో విమర్శలు స్టార్ట్ చేశారు.
అసలు మనదేశ భాష హిందీ అని ఎవరు చెప్పారు అని అజయ్ దేవగణ్ మీరు చదువుకోలేదా? అని సదరు హిందీ ప్రముఖులే అజయ్ దేవగణ్ కి జ్ఞ్యానోదయం చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో అజయ్ దేవగణ్ కి ఉన్న అవగాహాన లోపం బయటపడడంతో తన అభిమానులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి అయితే ఇలా ఈ యుద్ధం ముగిసింది.