ఇండస్ట్రీ టాక్ : ఫైనల్ గా నయనతార పెళ్లి..తేదీ వేదికలు ఎప్పుడు ఎక్కడ అంటే..!

nayanthara marriage : గత కొంత కాలం నుంచి కూడా సౌత్ ఇండియా సినిమా దగ్గర బిగ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు అయినటువంటి నయనతార ప్రముఖ దర్శకుడు రచయిత అయినటువంటి విగ్నేష్ తో డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అంతకు ముందు కూడా నయన్ ఓ ప్రముఖ దర్శకునితో డేటింగ్ చేసింది కానీ తర్వాత అది బ్రేకప్ అయ్యిపోయింది.

మరి ఫైనల్ గా అయితే ఈ దర్శకునితో తన జీవితాన్ని పంచుకోవాలని ఫిక్స్ అయ్యిన ఈమె ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లా చెబుతున్నారు. అయితే వారు చెబుతున్న దాని ప్రకారం అయితే నయనతార పెళ్లి వచ్చే నెల జూన్ లోనే ఉండబోతుందట.

పైగా జూన్ 9వ తేదీన వారి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలిసింది. అలాగే ఈ పెళ్లిని ఘనంగా అట్టహాసంగా కాకుండా సింపుల్ గా తిరుమల శ్రీవారి సన్నిధిలో చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారట. గత కొన్ని రోజులు కితమే వీరి కాంబోలో వచ్చిన సినిమా కోసం తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే.

మళ్ళీ ఇప్పుడు అక్కడే పెళ్లిని వారు నిశ్చయించుకోవడం జరిగింది. అయితే ఇది ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అని తమిళ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి కాకపోతే అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.