KRK : సేతుపతి, నయన్, సామ్ ల రొమాంటిక్ సినిమా కే ఆర్ కే….. ఆకట్టుకున్న ట్రైలర్…!

KRK : కన్మని రాంబో ఖాతిజ ఉపశీర్షిక నా విడుదలవుతున్న కే ఆర్ కే సినిమా ట్రైలర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. విజయ్ సేతుపతి, నయన తార, సమంత కలిసి నటించిన ఈ చిత్రం తమిళ చిత్రం కాతూ వాకుల్ రెండు కాదల్ కీ తెలుగు డబ్బింగ్. ఇక సినిమా ట్రైలర్ ను ఒకేసారి తమిళ తెలుగు భాషలలో విడుదల చేసారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టూ.. టూ.. టూ… ఐలవ్ యూ టూ… అనే పాట ఇప్పటికే విడుదలయి మంచి స్పందన తెచ్చుకుంది.

ఇక లేటెస్ట్ ట్రైలర్ లో ఖుషి సినిమాలోని దీపం సన్నివేశం గుర్తుకు వచ్చేలా పెట్టిన సన్నివేశం, బాహుబలి లో అనుష్క ప్రభాస్ లు బాణాలు వేసే సన్నివేశం ను చూపించడం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఇద్దరిని ప్రేమించిన వ్యక్తిగా విజయ్ నటన కామెడీ టైమింగ్ బాగున్నాయి.ఇక నయనతార, సమంతల నటన సినిమాకు ప్లస్ గా కనిపిస్తోంది. ఇక విగ్నేష్ శివన్ సినిమాలకు తెలుగులో కూడా ఆదరణ ఉంది.

YouTube video player

నేను రౌడీనే తమిళ డబ్బింగ్ సినిమాతో విజయ్ కు ఇటు విగ్నేష్ శివన్ కు తెలుగులో గుర్తింపునిచ్చింది. ఇక విజయ్ సేతుపతి కీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక నయనతార సినిమాకోసం ఆమె తెలుగు అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక సమంత గురించి చెప్పక్కర్లేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.