Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీలోని పెద్ద మనుషులు చిన్న హీరోలను తొక్కేస్తారు.. ఆహీరో విషయంలో కాలేదు.. సాయి వెంకట్!

Vijay Devarakonda: చిన్న సినిమాలే అనుకుంటాం గానీ, ఒక్కోసారి అదే పెద్ద సినిమా అవుతుందని దర్శకుడు సాయి వెంకట్ అన్నారు. కానీ అది ఎవరూ గ్రహించరని ఆయన చెప్పారు. చిరంజీవి దగ్గర్నుంచి అందరూ కూడా కింది స్థాయి నుంచే వచ్చారని ఆయన అన్నారు. అలా శ్రీకాంత్ గానీ, రవితేజ గానీ అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చారని ఆయన తెలిపారు. కానీ కింద ఉన్నపుడు మాత్రం వాళ్లకు సపోర్ట్ దొరకదని, అప్పుడు వాళ్ళ ఓన్ టాలెంట్ తోనే పైకి రావాలని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఒకపుడు తాను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల చాలా సినిమాలు రావడంతో కులం, మతం ఏదీ చూడలేదని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రా అని కూడా చూడలేదని, కేవలం చిన్న సినిమా తీశారా, అయితే నేను స్పాన్సర్ చేస్తున్న అని చెప్పి స్పాన్సర్ చేయడం, అంతే కాకుండా ఎవరూ రాకపోయినా తానే వెళ్లడం, అక్కడం ఉండడం, ఆడియో రిలీజ్ చేయడం, సినిమా ఇబ్బందులు పడితే వెంటనే మాట్లాడడం, వాళ్ళు డబ్బులు కట్టలేక పోతే, డబ్బులు కట్టించడం, రిలీజ్ చేయించడం చేసేవాడిని సాయి తెలిపారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో రిలీజ్ కి ఇబ్బంది అవుతుందని, అది కూడా కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఈ పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎందుకంటే థియేటర్స్ అన్నీ కొంత మంది చేతుల్లోనే ఉందని, కొంతమంది వాటిని లీస్ కు తీసుకున్నారని, వాళ్ళు కేవలం పెద్ద సినిమాలను మాత్రమే రిలీజ్ చేస్తారని, చిన్న సినిమాలను పట్టించుకోరని ఆయన చెప్పారు. ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఆదాయం రాదని ఆయన వివరించారు. వాళ్ళు కేవలం బిజినెస్ పరంగానే ఆలోచిస్తారని, అదే తమిళ్ లో అయితే అలా ఉండదని అక్కడ ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని ఆయన చెప్పారు.

కానీ ఇక్కడ మాత్రం కేవలం స్టార్ హీరోలను మాత్రమే ఆదరిస్తారని, కొత్త సినిమా వచ్చిందని, ఈ సినిమాలో ఏమైనా స్టఫ్ ఉందా అని చాలా మంది గమనించరు అని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ బాగా టాక్ వస్తే అప్పుడు వెళ్లి టిక్కెట్ తీసుకుంటారని సాయి వెంకట్ అన్నారు. దీని పైన నిరాహార దీక్ష కూడా తాము చేశామని ఆయన అన్నారు.