Big Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ డేట్ ఫిక్స్…. ప్రసారం ఎప్పుడంటే?

Big Boss OTT: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తిచేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇదిలా ఉండగా తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్లలో పూర్తిచేసుకుని త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20వ తేదీ ప్రసారం అవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ నుంచి ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

ఇప్పటివరకు బుల్లితెరపై కేవలం ఒక గంట పాటు మాత్రమే ప్రేక్షకులను సందడి చేసిన ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది. ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తి అయిందని త్వరలోనే వారందరూ క్వారంటైన్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం.