Radhe Shyam : ఇప్పుడు పాన్ ఇండియా వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి భారీ చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు డస్కీ హీరోయిన్ పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుండగా ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయిలో పెంచుకునేందుకు చిత్ర బృందం ఓ భారీ ప్లాన్ ని కూడా చేశారు.
ఇది వరకే వచ్చిన ఆసివ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు వేరే లెవెల్లోకి వెళ్లాయి. కానీ మధ్యలో చాలా గ్యాప్ రావడంతో రెండో ట్రైలర్ కి సంబంధించి అప్డేట్ ని చిత్ర బృందం అందించారు. జస్ట్ నిన్ననే ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ వస్తుందని ప్రకటించగా మరింత హైప్ నెలకొంది.
కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ గా ప్లాన్ చేసిన ఆ రెండో ట్రైలర్ రావడం లేదట. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ అన్ని భాషల్లో కలిపి ట్రైలర్ కి బదులుగా మరో అదిరే ట్రీట్ ని ప్లాన్ చేశారట. అదే ఈ సినిమాలోని మొదటి 2 నిమిషాల ఇంట్రడక్షన్ అట.
అయితే పూర్తిగా రెండు నిముషాలు కాదు కానీ ఆ లోపు సినిమాకి చెందిన క్లిప్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారట. దీనితో ఖచ్చితంగా అందరిలో భారీ హైప్ రావడం ఖాయం అని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారట. లాస్ట్ మినిట్ లో చేసిన బిగ్ చేంజ్ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.