బిగ్ బజ్ : ఒకేరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ బ్లాస్ట్..ఏ రకంగా అంటే.!

big buzz on ntr  : మన తెలుగు సినిమాల స్టార్ హీరోల పుట్టినరోజు వస్తుంది అంటే ఆ హీరోల అభిమానులకి ఆ ఏడాదిలో మరో పెద్ద పండుగ వచ్చినట్టే అని చెప్పాలి. అందుకే ఆ ఒక్క రోజుని మాత్రం భారీ స్థాయిలో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు ఈ ఏడాదిలో ఇదే మే నెలలో మన తెలుగులో భారీ స్టార్డం ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తుండడంతో తారక్ అభిమానులు ఆల్రెడీ భారీ సన్నాహాలు మొదలు పెట్టారు.

అయితే హీరో పుట్టినరోజు అంటే తన సినిమాల నుంచి అప్డేట్స్ తప్పని సరి. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల నుంచి ఈ మే 20న తన పుట్టినరోజు సందర్భంగా ముచ్చటగా మూడు ట్రీట్ లు వస్తున్నట్టుగా బిగ్ బజ్ వినిపిస్తుంది. మొదటగా తాను నటించిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఓటిటి లో రిలీజ్ అవుతుండగా..

దానితో పాటుగా కొరటాల శివతో చేస్తున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే దానితో పాటుగా ఎన్టీఆర్ నటించబోయే సినిమాల నుంచి ఒక ఖచ్చితమైన అప్డేట్ రానున్నట్టు తెలుస్తుంది. దీనితో ఆ ఒక్కరోజులో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ బ్లాస్ట్ ఖాయం అని చెప్పాల్సిందే. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే కాస్త హాట్ టాపిక్ గా మారింది.