ఆచార్య’లో ఆ ఒక్క పాట కోసం ఎంత ఖర్చో తెలుసా !

Big budget for single song in Acharya
Big budget for single song in Acharya
Acharya

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’. మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్, రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రధానంగా టెంపుల్ సెట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అలాగే ఒకే ఒక్క పాట కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయించారట కొరటాల శివ. కొరటాల సినిమాలు అంటేనే భారీ సెటప్లో ఒక మాంటేజ్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాట కోసం పెద్ద మొత్తంలో డబ్బులు పోయిస్తారు. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్’ ఇలా ప్రతి సినిమాలోనూ అలాంటి సాంగ్ ఒకటి ఉంటుంది.

అలాగే ‘ఆచార్య’లో కూడ అలాంటి పాటే ఒకటి ఉందట. మొన్నామధ్యన మిలటరీ డ్రెస్సుల్లో చిరు, రామ్ చరణ్ ఫోటోలు లీకయ్యాయి. ఆ స్టిల్స్ కూడ ఆ పాటలోనివేనట. ఆ పాట కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట. సినిమాలో కూడ పాట మంచి ట్రీట్ అనేట్టు ఉంటుందట. సినిమాలోని హైలెట్ అంశాల్లో ఒకటిగా నిలిచిపోతుందట. చిరుతో పాటు చరణ్ కూడ ఇందులో ఉండటంతో వెనుకాడకుండా డబ్బులు పోసేశారట. భారీ హైప్ నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది.