Big Boss Nonstop: ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో తనని తాను సేవ్ చేసుకుంటున్న బాబా భాస్కర్!

Big Boss Nonstop: తెలుగు, హిందీ, తమిళ వంటి పలు భాషలలో బిగ్ బాస్ రియాలిటీ షో మంచి గుర్తింపు పొందింది. ఇదివరకు బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఓటిటి లో ప్రసారమవుతుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం 24/7 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ఓటిటి లో ప్రసారమవుతోంది. మునుపటి సీజన్లో అలాగే ఈ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

ఈ సీజన్లో వారాంతంలో ఉండే నామినేషన్లు, ఎలిమినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఓటింగ్ రూపంలో మాత్రమే కాకుండ కొన్నిసార్లు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్నది కంటెస్టెంట్ ల చేతిలో కూడా ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అరియన, ఆషూ రెడ్డి ఇద్దరిలో ఒకరిని ఈ వారం నామినేషన్స్ నుండి బయటపడేసే అవకాశం బాబా భాస్కర్ మాస్టర్ కి ఉంది. 8వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన బాబా భాస్కర్ మాస్టర్
ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్నాడు. ఈ పాస్ ద్వారా బాబా భాస్కర్ మాస్టర్ లో ఉన్న ఆషూ , అరియాన ఇద్దరిలో ఒకరిని కాపాడే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు.

ఈ ఫ్రీ పాస్ ద్వారా ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ బాబా భాస్కర్ మాస్టర్ ఎవరినైనా కాపాడవచ్చు. లేదంటే ఈ వారం బాబా భాస్కర్ మాస్టర్ ఎలాగో నామినేషన్స్ లో లేడు కాబట్టి వచ్చే వారం నామినేషన్స్ ఉంది తనను తాను కూడా కాపాడుకోవచ్చని నాగార్జున గారు చెప్పారు. బాబా భాస్కర్ మాస్టర్ కి తనని తాను కాపాడుకునే అవకాశం వచ్చిన తర్వాత వేరే వారిని కాపాడటానికి ఈ పాస్ ఎందుకు ఉపయోగిస్తారు. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా వచ్చే వారంలో కూడ భాస్కర్ మాష్టర్ నామినేషన్ లో ఉండకుండా తనని తాను కాపాడుకుంటా అని చెప్పినట్లు సమాచారం. దీంతో బాబా భాస్కర్ మాస్టర్ వచ్చేవారం టాప్ 6 లో చోటు సంపాదించుకుంటారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.