Kaushal: తప్పుడు స్టేట్‌మెంట్‌లు తీసుకుని, కొన్ని ఫ్రూప్స్ చూపించి తనను స్టూడియోకి రమ్మని, ఏవేవో చేశారని నటుడు కౌషల్ అన్నారు. మామూలుగా బిగ్‌బాస్ అని పెట్టినప్పుడే తాను వెళ్లకుండా ఉండాల్సిందని, కానీ ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి, మన సైడ్ నుంచి తప్పేం లేదు కాబట్టి అందులో నిజం లేదని, దాన్ని తాను బయటకి చెప్పాలనుకున్నాని, అందుకే ఆ షోకు తాను వెళ్లానని ఆయన అన్నారు. తాను ఇలాంటేవీ పట్టించుకోనన్న ఆయన, ఈ విషయాన్ని మాత్రం కొంచెం ఎక్కువగా పట్టించుకున్నానని ఆయన తెలిపారు.
కొన్ని లక్షల, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.. వాళ్లేం అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ తాను మాత్రం నిజం ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్లు చెప్పింది తప్పు అని వాళ్ల ఛానెల్‌కు వెళ్లానని ఆయన తెలిపారు. లేకపోతే వెళ్లకపోయేవాడినని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా తనకేం ఇబ్బంది లేదని ఆయన వివరణ ఇచ్చారు.
ఇకపోతే తాను బిగ్‌బాస్ ముందు గానీ, తర్వాత గానీ చెప్పేదేంటంటే ఎడ్యుకేటింగ్ పీపుల్ అని ఆయన చెప్పారు. స్వతహాగా తాను సంపాదించుకున్న ఫ్యాషన్ అనే ఈ టాలెంట్‌ను పది మందికి పంచానని ఆయన అన్నారు. దాంతో ఇప్పటివరకు దాదాపు 3000పైగా మోడల్స్‌ను తయారు చేశానని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. ఇంకా అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని వాళ్లందరికీ ఈ మోడల్ విద్యను నేర్పించాలని, అంటే ఫ్యాషన్‌కు సంబంధించి తానొక కళాశాల ఏర్పాటు చేయాలనేదే తన లక్ష్యం అని ఆయన చెప్పారు. యాక్టింగ్‌లో అవకాశం వస్తే చేస్తానన్న కౌషల్, తాను చెప్పిన ఫ్యాషన్ విద్యను అందించేందుకు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.