బిగ్ అప్డేట్ : మహేష్, త్రివిక్రమ్ భారీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ కాంబోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో కూడా ఒకటని చెప్పాలి. పెద్దగా సక్సెస్ లేకపోయినా కూడా ఇంకో సినిమా అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి కదా అదే ఈ కాంబోలో ఉన్న అతి పెద్ద మ్యాజిక్.

అందుకే ఈ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా ఆగష్టు నుంచి స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమాపై చిత్ర బృందం అయితే భారీ అప్డేట్ ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఒక క్రేజీ వీడియోతో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కల్లా రెడీ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా మాసివ్ అనౌన్సమెంట్ ఇచ్చేసారు.

అంతే కాకుండా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మ్యూజిక్ వర్క్ కూడా వేగంగా జరుగుతుండగా ఈ ఆగష్టు నుంచే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టు తెలియజేసారు. మొత్తానికి అయితే ఈ క్రేజీ కాంబో మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాని హారిక హాసిని వారు నిర్మాణం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.