Bheemla Nayak : ‘భీమ్లానాయక్’కి ఏపీ సర్కారు నుంచి చిక్కులు తప్పవ్.!

Bheemla Nayak : థియేటర్ల యాజమాన్యాలకు హెచ్చరికలు వెళుతున్నాయట.. అదనపు సోలు వెయ్యడానికి వీల్లేదు.. టిక్కెట్ల ధరల్ని పెంచడానికి అసలే వీల్లేదు. థియేటర్లన్నీ నిబంధనలకు లోబడి పని చెయ్యాలి.. థియేటర్ల క్యాంటీన్లలోనూ ధరల విషయంలో అస్సలేమాత్రం పొరపాట్లు జరగకూడదు..

అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘భీమ్లానాయక్’ సినిమా ప్రదర్శితం కానున్న సినిమా తియేటర్లకి.
ఇది నిజమేనా.? అంటే, అధికారికంగా ఇప్పటివరకు ఈ విషయమై ఎలాంటి స్పష్టత లేదు. గతంలో ప్రభుత్వం టిక్కెట్ ధరల్ని నియంత్రిస్తూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు ఓ బృందంలా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు.. ఈ నేపథ్యంలో ‘సమస్య పరిష్కారమయ్యింది..’ అంటూ చూచాయిగా ప్రకటన కూడా వచ్చేసింది.

సినీ నటుడు చిరంజీవి అలాగే ప్రభాస్, మహేష్ తదితరులు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం విదితమే. ‘ఆల్ ఈజ్ వెల్’ అని అంతా అనుకుంటున్న తరుణంలో, ‘భీమ్లానాయక్’ సినిమాపై అధికార పక్షం ‘కక్ష’ కట్టిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత.?

చర్చలు సఫలమైనా, అధికారిక ప్రకటన అయితే రాలేదు కాబట్టి.. ‘భీమ్లానాయక్’ వరకు పాత విధానాన్ని కొనసాగిస్తూ, ‘భీమ్లానాయక్’ని ముంచేశాక కొత్త విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది జగన్ సర్కారు.. అన్న భావన జనంలోకి వెళ్ళిపోయింది.

మరి, ఈ రగడపై ప్రభుత్వం అధికారికంగా స్పందిస్తుందా.? అంతా దుష్ప్రచారమేనని కొట్టిపారేస్తుందా.? వేచి చూడాల్సిందే.