Bheemla Nayak : న్సైడ్ టాక్ : “భీమ్లా నాయక్” రిలీజ్ మళ్ళీ వాయిదా..మరి రిలీజ్ ఎప్పుడంటే?

Bheemla Nayak :అదేంటి ఆల్రెడీ రిలీజ్ అయ్యిపోయిన భీమ్లా నాయక్ సినిమా మళ్ళీ వాయిదా పడటం ఏమిటి అనుకుంటున్నారా? అవును సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిపోయింది. కానీ మళ్ళీ వాయిదా పడింది. దీని వివరణలోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ స్టార్ హీరో అయినటువంటి రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”.
దర్శకుడు సాగర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ తెలుగులో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. కానీ ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చెయ్యడంతో మరింత ఆసక్తి నెలకొంది.
కానీ తర్వాత అనుకున్న టైం కి రిలీజ్ అవ్వడానికి అయితే స్ట్రగుల్స్ పడుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ మార్చ్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా మళ్ళీ వాయిదా పడింది. దీనితో ఎవరికీ హిందీ రిలీజ్ పట్ల ఒక క్లారిటీ అయితే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్ ఒకటి తెలుస్తుంది.
ఈ సినిమాని చిత్ర బృందం ఏప్రిల్ నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి డేట్ పరిశీలనలో ఉండగా కొత్త డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. మరి అసలుకి భీమ్లా నాయక్ హిందీలో రిలీజ్ అవుతుందో లేదో అనేది ఆ శివయ్యకే ఎరుక. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.