Bheemla Nayak : పవన్ కి స్ట్రాంగ్ ప్లేస్ లోనే స్ట్రగుల్ అవుతూ “భీమ్లా నాయక్” కి నష్టాలు.!

Bheemla Nayak : టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కోసం తెలిసిందే. లాంగ్ రన్ లో ఏమో గాని ఓపెనింగ్స్ అయితే మాత్రం పవన్ సినిమాలకి రికార్డు స్థాయిలోనే వస్తాయి. మరి అలాగే ఇప్పుడు తాను నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” కి కూడా నమోదు అయ్యాయి.
నైజాం ప్రాంతంలో అయితే మొదటి రెండు రోజులు కూడా ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకొని అక్కడ బ్రేకీవెన్ ఫిగర్ కి చేరుకున్న భీమ్లా నాయక్ మాత్రం ఏపీలో బాగా స్ట్రగుల్ అవుతున్నాడట. మరి పవన్ క్రేజ్ కి మంచి వసూళ్లు ఇచ్చే స్ట్రాంగ్ ప్లేస్ లలో ఏపీలోని ఉత్తరాంధ్ర కూడా ఒకటి.
అక్కడ పవన్ మరియు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకి మంచి రీచ్ ఉంది. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ అక్కడ నష్టాల్లోనే ముగించనున్నట్టు తెలుస్తుంది. ఒక్క ఉత్తరాంధ్ర లోనే ఈ సినిమాని దాదాపు 9 కోట్లు పెట్టి కొనగా ఇప్పుడు భీమ్లా నాయక్ దగ్గర దగ్గర 7 కోట్లు షేర్ ని వసూలు చేసిందట. ఇక అలాగే ఈ వారం తర్వాత ఎలాగో సినిమా థియేటర్స్ లో ఉండదు.
సో ఎలా చూసుకున్నా కోటిన్నర నుంచి రెండు కోట్లు భీమ్లా నాయక్ నష్టాలని ఇస్తాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఏపీలో చాలా ఏరియాల్లో భీమ్లా నాయక్ కి నష్టాలు తప్పేలా లేవని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా నిత్య మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే నాగవంశీ నిర్మాణం వహించారు.