“భీమ్లా నాయక్” అంత మొత్తంలో ఆఫర్ వచ్చిందా.?

Bheemla Nayak Got Huge Ott Offer Here Is Clarity | Telugu Rajyam

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. రానా దగ్గుబాటి కూడా సాలిడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొల్పుకొంది. మరి దాదాపు 70 సాతంకి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇంకా షూటింగ్ కొనసాగించుకుంటుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకి భారీ మొత్తంలో ఓటిటి ఆఫర్ వచ్చినట్టుగా ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాకి ఏకంగా 150 కోట్ల భారీ ఓటిటి ఆఫర్ తో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇందులో అయితే ఎలాంటి నిజం లేదట. గతంలో వకీల్ సాబ్ కి అయితే 100 కోట్ల మేర ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే కానీ..

భీమ్లా నాయక్ కి మాత్రం ఎలాంటి ఆఫర్ రాలేదని సినీ వర్గాల్లో టాక్. అందుకే ఇది జస్ట్ రూమర్ మాత్రమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles