Bheemla nayak : “భీమ్లా నాయక్” పై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు..!

 Bheemla nayak : లేటెస్ట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆదరగొడుతున్న తాజా చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సహా ఓవర్సీస్ లో భీమ్లా నాయక్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు.
మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ మరియు లేడీస్ ని బాగా నిరాశ పరిచిన అంశం. ఈ సినిమాలో హిట్ సాంగ్ “అంత ఇష్టం”  లేకపోవడం. ఇది చాలా మందికి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు దీనికి మించిన షాక్ ని ఈ సినిమా దర్శకుడు సాగర్ కే చంద్ర రివీల్ చేసాడు. అసలు ఈ సాంగ్ ని ఈ సినిమాలో షూటింగ్ నే చెయ్యలేదట.
అందుకే సినిమాలో పెట్టలేదు అని షాకింగ్ ట్విస్ట్ ని అందించారు. దీనితో ఇది అభిమానులు కి మళ్లీ సాంగ్ ని యాడ్ చేస్తారా అనుకునే వారికి మరోసారి డిజప్పాయింట్ చేసే వార్తగా మారింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్ పవన్ సరసన హీరోయిన్ గా నటించగా సంయుక్త మీనన్ రానా సరసన నటించింది. అలాగే థమన్ సంగీతం అందివ్వగా త్రివిక్రమ్ ఒక పాట, మాటలు స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి అందించారు.