Bheemla Nayak : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి భారీ అంచనాలతో వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కాస్త చెప్పుకోదగ్గ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “భీమ్లా నాయక్” అని చెప్పాలి. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఈ సినిమా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా రిలీజ్ కి గాను టికెట్ ధరలు మరికొన్ని సమస్యలు ఎదురైనా ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది. కానీ ఊహించని విధంగా సోమవారంకి వచ్చేసరికి మాత్రం భీమ్లా నాయక్ భారీగా తగ్గిపోయింది. మరి ఈ గడిచిన నాలుగు రోజులు వసూళ్ల వివరాలు కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టు అయితే..
మొదటి రోజు 39 కోట్లు, రెండో రోజు 23 కోట్లు మూడో రోజు 25.4 కోట్లతో బాగానే రాబట్టినా నాలుగో రోజుకి మాత్రం 9.3 కోట్లకి తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా పడింది. దీనితో నాలుగులో భీమ్లా నాయక్ 96.7 కోట్ల గ్రాస్ ని అందుకొని భారీ ఫిగర్ 100 కోట్ల వసూళ్లు కేవలం ఏపీ, తెలంగాణ నుంచే రాబట్టే దిశగా కొనసాగుతుంది.
దీనితో పవన్ ఖాతాలో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి 100 కోట్లు వసూళ్లు అందుకున్న మరో సినిమాగా ఇది నిలిచే దిశగా కొనసాగుతుంది. కానీ పలు చోట్ల అయితే భీమ్లా నాయక్ నష్టాలనే మిగిల్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి చూడాలి ఫైనల్ రన్ లో భీమ్లా నాయక్ ఎక్కడ ఆగుతాడో అనేది.