Bheemla Nayak : బాక్సాఫీస్ రిపోర్ట్ : 13 రోజుల “భీమ్లా నాయక్” వరల్డ్ వైడ్ వసూళ్ల వివరాలు ఇవే.!

Bheemla Nayak : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో అత్యంత ముఖ్యమైన మొదటి సినిమా “భీమ్లా నాయక్”. గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నిత్య మీనన్ హీరోయిన్ గా అలాగే రానా దగ్గుబాటి మరో హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర వర్క్ చేసాడు.
మరి ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి రికార్డు ఓపెనింగ్స్ కూడా అందుకుంది. మరి ఇపుడు ఎలాగో ఫైనల్ రన్ కి ఈ సినిమా వచ్చేసింది. రేపు భారీ సినిమా “రాధే శ్యామ్” రాకతో భీమ్లా నాయక్ షో లు దాదాపు అన్ని చోట్ల ఆగిపోవచ్చు. మరి నిన్న మార్చ్ 9 వరకు టోటల్ 13 రోజులు తాలూకా భీమ్లా నాయక్ వసూళ్లు వివరాలు ఇపుడు ట్రేడ్ వర్గాల్లో తెలుస్తున్నాయి.
ఈ సినిమాకి 13 వ రోజు వసూళ్లు కూడా 1.07 కోట్లు వచ్చాయట. దీనితో ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 185.5 కోట్ల గ్రాస్ ని అందుకుందట. అలాగే ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ ని ఎప్పుడో దాటిన ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటివరకు 104 కోట్ల షేర్ ని రాబట్టినట్టు తెలుస్తుంది.
కానీ ఏపీలో అయితే దాదాపు అన్ని చోట్లా కూడా నష్టాలే వచ్చాయట. అయినా ఈ రేంజ్ వసూళ్లు రావడం సంచలనమే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఇంకో రెండు మూడు కోట్లతో అయితే భీమ్లా నాయక్ చాప్టర్ బాక్సాఫీస్ దగ్గర క్లోజ్ అయ్యిపోవచ్చు. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా నాగవంశీ నిర్మాణం అందించారు.