Bhanu Sri: ఐదు ఎపిసోడ్స్ తర్వాత షో నుంచి వెళ్ళిపోమని చెప్పారు.. బాధపడ్డాను: భానుశ్రీ

Bhanu Sri: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్ నటి భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ షో తర్వాత కూడా చాలా కామెడీ షోలలో పాల్గొని ప్రేక్షకులకు బాగా చేరువ అయింది. కొన్ని సినిమాలలో షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సిరీస్ లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఢీ లాంటి డాన్స్ షోలు కూడా చేసింది. ప్రస్తుతం ఒకవైపు సేవలు మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది భాను.

కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది భాను శ్రీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. కాగా భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత ఢీ షోలో మెంటర్ గా చేసిన విషయం తెలిసిందే. కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మధ్యలోనే వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటో భానుశ్రీ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది.

ఈ సందర్భంగా భానుశ్రీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ తర్వాత ఢీ ఆఫర్ వస్తే బిగ్ బాస్ టీమ్ వాళ్లకు చెప్పే చేశాను. కానీ అయిదు ఎపిసోడ్స్ అయ్యాక ఫోన్ చేసి మీరు ఆ షో చేయొద్దు అన్నారు. నేను మీకు చెప్తే ఓకే అన్నారని కదా చేస్తున్నాను అని అడిగితే మా రీజన్స్ మాకు ఉన్నాయి, అగ్రిమెంట్ లో మీరు వేరే ఛానల్ షోలు చేయొద్దు అని ఉంది కదా అన్నారు. దాంతో మధ్యలో వెళ్ళిపోయాను. నేను డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి ఢీలో ఒక డ్యాన్స్ టీమ్ కి మెంబర్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇలా మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది భాను శ్రీ.