Bellamkonda Srinivas: రోజు ఒకరంటే కష్టమే తమ్ముడూ… 3 పెళ్లిళ్లు చేసుకోవాలి: బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ సురేష్ బాబు ఒకరు. అయితే ఈయన నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. అల్లుడు శ్రీను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన శ్రీనివాస్ పలు సినిమాలలో నటించిన పెద్దగా ప్రేక్షకాదరణ మాత్రం అందుకోలేకపోయారు.

ఇక ఇండస్ట్రీకి చాలా విరామం తర్వాత త్వరలోనే భైరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సుమాకు బెల్లంకొండ శ్రీనివాస్ తో మాట్లాడుతూ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పక్కనే ఉన్న మనోజ్ వెంటనే అంతా డాడీనే అంటూ సమాధానం ఇచ్చారు. పెళ్ళి విషయం ఒక్కటీ తనకే వదిలేశారని సాయి శ్రీనివాస్ చెప్పారు. ”తెల్లారే సరికి నువ్వు మర్చిపోతున్నావ్ కదా తమ్ముడూ.. రోజూ ఒకరంటే కష్టం” అని మంచు మనోజ్ సరదాగా అన్నారు.

వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ అందుకుంటూ.. కొంతమంది హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇలా ఈయన ఒకటి కాదు ఏకంగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాను అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.