టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని ఢీకొట్టం అంటే అంత ఈజీనా. రాజకీయాలలోకి రాకముందే చంద్రబాబు లో ఇబ్బడిముబ్బ డిగా లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఇంకెంత రాటు దేలిపోయి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్ధాల రాజకీయం అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఎక్కడికి పోతాయి? ఆ అనుభవాన్నంతటిని కూడగట్టుకుని ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి యంత్రాగాన్ని ఎన్ని తిప్పలు పెట్టిస్తున్నాడో కళ్లారా చూస్తున్నాం. అధికారం జగన్ చేతిలో ఉన్నా పాలన చంద్రబాబు చేతుల్లో ఉన్నట్లే నడుస్తోంది.
చట్టంలో లొసుగుల్ని వాడుకుని తన మార్క్ రాజకీయం చేస్తున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. అలాంటి నాయకుడితో అత్తమ్మ లక్ష్మీపార్వతి దశాబ్ధ కాలంపైగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా..లేకపోయినా ఎప్పటికప్పుడు తన స్వరాన్ని లక్ష్మీ పార్వతి మీడియాలో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తన భర్త ఎన్టీఆర్ వెన్నుపోటి పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నారు అన్న పాయింట్ దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి కేసు వరకూ అవకాశం చిక్కినప్పుడల్లా ఆమె బాణీ గట్టిగానే వినిపించారు. ఈ క్రమంలోనే ఆమె 2005లో చంద్రబాబు అక్రమాస్తులపై కూడా విచారణ జరపాలని పోరాటం మొదలు పెట్టారు.
కానీ చంద్రబాబు ఎప్పటికప్పుడు స్టే తెచ్చుకుంటూ తప్పించుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో రాజ్య సభ సభ్యుడొకరు దీని గురించి ఏమన్నారంటే? ఇది గిన్నీస్ బుక్ లో చేరాల్సిన అంశం. ఇన్ని సంవత్సరాల పాటు స్టే అంటే చిన్న విషయం కాదని చంద్రబాబు ట్యాలెంట్ కి నిదర్శనం అన్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో లక్ష్మీ పార్వతి ఆ పెద్దాయన మాటలు విని ఆగ్రహం చెందారు. చంద్రబాబు అవినీతిపై మోదీకి, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు, న్యాయ వవ్యవస్థకు కూడా లేఖలు రాస్తానని ప్రకటించారు. మాటలకే లేని విలువ లేఖలు ఉంటుందా? అంటే సమాధానం కష్టమే. మరి చంద్రబాబు అత్త అయి ఉండి ఇంత అమాయకంగా ఎలా వ్యవహరిస్తున్నారో ఏంటో.