Kalyan Krishna: సినీ ఇండస్ట్రీ ఎంతోమంది నటీనటులు, దర్శక నిర్మాతలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను, అవాంతరాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారిని ఎవరైతే అవమాన పరిచారో, అదే విధంగా వారిని ఎవరైతే తక్కువగా చూశారో అలాంటి వారు చేసినవి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న అని తెలిపాడు. మొదటి సోగ్గాడే చిన్నినాయన ఈ సినిమాతో మంచి హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఆ తర్వాత ఆ పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా తీవ్ర నిరాశ ఎదురైంది.
ఇక ఇటీవల సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇప్పటికే భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతూనే ఉంది. బంగార్రాజు సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లో తాను ఎదుర్కొన్న అవమానాలు గురించి చెప్పుకొచ్చారు. కెరీర్ మొదట్లో తాను ఒక సినిమాకి అప్రెంటిస్ గా పని చేశానని, సినిమా పూర్తయి డబ్బింగ్ మొదలైన తర్వాత ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉండేవాడిని అనే కళ్యాణ్ కృష్ణ తెలిపారు.
ఆ సమయంలో కళ్యాణ్ కృష్ణకు నువ్వు డబ్బింగ్ కి రావాల్సిన పనిలేదు అని చెప్పినా కూడా డబ్బింగ్ రూమ్ దగ్గర దాదాపుగా వారం రోజులపాటు నిలబడి ఉన్నాడట. ఆ సమయంలో నిర్మాత ఇక్కడ ఎందుకు నిలబడ్డావు లోపలికి రా అని పిలవడంతో లోపలికి వెళ్ళాను అని చెప్పుకొచ్చాడు కళ్యాణ కృష్ణ. ఈ నేపథ్యంలోనే మొదటి లైట్ మెన్ గా పని చేయమని చెప్పగా నాలుగు గంటల పాటు నిలబడి లైట్ మెన్ డ్యూటీ చేసిన తర్వాత కాళ్ళు నొప్పి రావడంతో ఒక కుర్చీలో కూర్చున్నాడట. ఇంతలో అక్కడికి నిర్మాత వచ్చే ఏంటి అప్పుడే కూర్చున్నావు ఆ మాత్రం సహనం లేకపోతే ఇండస్ట్రీలో నువ్వు పనికిరావు వెళ్ళిపో అని అనడంతో కళ్యాణ్ కృష్ణ ఎంతగానో ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చారు. అలా సినీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అని తెలిపారు కళ్యాణ్ కృష్ణ.