AP : వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వరుసగా రాజీనామాలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అందరిలోనూ ఎంతో ఆందోళన నెలకొంది తాజాగా పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వైయస్సార్సీపీ నేతలకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ గా పార్టీ వ్యవహారాలన్నింటినీ ఎంతో చక్కబెడుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్న విజయ్ సాయి రెడ్డి ఇలా రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అంటూ సొంత పార్టీ నేతలే ఆలోచనలో పడ్డారు..
ఇలా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉందని మరికొందరు భావిస్తున్నారు. అయితే తాజాగా ఈయన అరెస్టుపై సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పందించారు. గత కొద్ది కాలం నుంచి విజయసాయిరెడ్డి బండ్ల గణేష్ మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ సాయి రెడ్డి రాజకీయాలకు సెలవు ప్రకటిస్తూ చేసినటువంటి పోస్ట్ పై బండ్ల గణేష్ స్పందించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి అధికారం పోయి పార్టీ కష్టంలో ఉంటే వేరే పార్టీలలోకి వెళ్లడం, రాజకీయాలకు రాజీనామాలు చేయడం ఇటీవల కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయిందని బండ్ల గణేష్ తెలిపారు. ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బయటకు వెళ్లిపోవడం ధర్మమేనా అంటూ విజయ్ సాయి రెడ్డి రాజీనామాని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో వైసిపి నాయకులు, కార్యకర్తలు సైతం షాక్ అవుతున్నారు. ఎంతమంది కార్యకర్తలు సైతం సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఆయనని వదిలిపెట్టి వెళ్లి ఒంటరి వాడిని చేయొద్దని ఇలా వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయ్ సాయి రెడ్డి వెల్లడించారు.