నటుడిగా కన్నా బడా నిర్మాతగా ఫోకస్ అయిన బండ్ల గణేష్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన గణేష్ అంచెలంచెలుగా పెద్ద నిర్మాతగా ఎదిగి వైనం గురించి తెలిసిందే. ఓ నుటుడిగా కన్నా నిర్మాతగా ఎక్కు పేరు సంపాదించాడు. రాజకీయ నాయకులతో పరిచయాలు..సినిమా వాళ్లతో ఉన్న స్నేహం కారణంగా గణేష్ అనతి కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఇదే క్రమంలో రాజకీయాలలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అక్కడా రంగ ప్రవేశం చేసాడు. తెలంగాణ రాష్ర్ట రాజకీయాల్లో ఓ సునామీలో దూసుకొచ్చిన ఆయన ఒక్కసారిగా సెల ఏరులా మారిపోయారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ ఎస్ పై విమర్శల వర్షం గుప్పించి సోషల్ మీడియాలో బోలెడంత పాపులారిటీ సంపాదించాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీక కొసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. చివరికి మాట మార్చి సైలెంట్ అయిపోయాడ నుకోండి. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమా వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.గత కొన్ని నెలలుగా అగ్ర హీరోల డేట్లు కోసం వెయిట్ చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఐయామ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలో రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్థావన తీసుకురాలేదు.
తాజాగా పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలికినట్లు తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రాజకీయాలొద్దు…సినిమాలే ముద్దు అంటూ అనేసాడు. జీవితంలోకిక్ కావాలంటే ఒక సినిమానే ఇస్తుంది. నాకు సినిమానే ప్రాణం. సినిమానే శ్వాశిస్తా. 15వ ఏట పరిశ్రమకి వచ్చా. అక్కడ పరిస్థితులకు అలవాటు పడిన ప్రాణం. ఎలాంటి ఒడిదుడుకులునైనా అక్కడ తట్టుకోగలను అన్నారు. ఇక రాజకీయాలు వద్దు..సినిమాలు ముద్దు. నా వల్ల..నా మాటల వల్ల బాధపడ్డ ప్రతీ ఒక్కరికీ క్షమించమని అడుగుతున్నాని కోరాడు మొత్తానికి బండ్ల గణేష్ యూటర్న్ ఊహించనిదే.