Vijay Sai Reddy : బండ్ల గణేష్‌ని వీధికుక్కతో పోల్చిన విజయ సాయిరెడ్డి.!

Vijay Sai Reddy  : తనపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి. ట్విట్టర్ ద్వారా రాజకీయ ప్రత్యర్ధులకు ధీటైన సమాధానాలివ్వడం విజయ సాయి రెడ్డిక కొత్తేమీ కాదు.

‘ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు  ఓడలు కావు. అయ్యో…గణేశా!’ అంటూ ట్వీటాస్ర్తం సంధించారు విజయ సాయి రెడ్డి.

ఒక్క మాటలో చెప్పాలంటే, బండ్ల గణేష్‌ని వీధి కుక్కతో పోల్చారు వైసీపీ ఎంపీ. అది కూడా ‘పిచ్చి పట్టిన వీధి కుక్క’ అనడం గమనించాల్సిన విషయం. ఎవడో ఉస్కో అనగానే.. అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొనడం వెనక చర్చనీయాంశంగా మారింది.

సామాజిక వర్గ కోణంలో చూస్తే, చంద్రబాబు ‘ఉస్కో’ అన్నారని విజయ సాయి రెడ్డి భావమా.? లేదు సాన్నిహిత్యం కోణంలో చూస్తే మంత్రి బొత్స సత్యనారాయణ, ‘ఉస్కో’ అని బండ్ల గణేష్‌ని విజయ సాయి రెడ్డి పైకి ఎగదోశారా.? అని. ఇవేమీ కాదు, పవన్ కళ్యాణ్ మీద విజయ సాయిరెడ్డికి అనుమానమా.?

‘ఓడలు బండ్లవుతాయి కానీ, బండ్లు ఓడలు కావు..’ అని విజయ సాయి రెడ్డి పేర్కొనడం కరెక్టు కాదేమో.. అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఓ సాధారణ కమెడియన్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు.

బండ్ల తలచుకుంటే, విజయ సాయి రెడ్డిలా రాజ్యసభకు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు.