ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు విపరీతంగా వేడెక్కాయి. రాజకీయ నాయకులు ఒకరిని మరొకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా చాలా దూకుడు మీదున్నాడు. దుబ్బాకలో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్న కసితో ఉన్నాడు.
కానీ.. మరోవైపు దుబ్బాకలో తమ పార్టీ గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయిందని సీఎం కేసీఆర్ చెప్పేశాడు. ఎవ్వరు ఏం చేసుకున్నా.. దుబ్బాక గెలుపు అనేది తమకు పెద్ద లెక్కే కాదంటూ తీసిపారేశారు సీఎం కేసీఆర్. ట్రబుల్ షూటర్ హరీశ్ రావును ఇప్పటికే దుబ్బాకలో దింపేశారు. మరోవైపు మిగితా పార్టీలు కూడా దుబ్బాకలో పాగా వేశాయి.
అసలు విషయానికి వస్తే.. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్.. పాస్ పోర్టుల బ్రోకర్ అంటూ సంజయ్ మండిపడ్డారు.
నిరుద్యోగులను మంచేసి కోట్లు సంపాదించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. దానికి కారణం అవినీతిపరుడైన సీఎంను ఎన్నుకోవడం. బీసీలను ఈ సీఎం ఏనాడూ ఆదుకోలేదు.. అంటూ బండి సంజయ్ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.