కేసీఆర్ కొత్త పార్టీ అందుకే పెట్టారట.. బండి అలా టార్గెట్ చేశారా?

bandi sanjay

సీఎం కేసీఆర్ కొత్త పార్టీ భారత్‌ రాష్ట్ర సమితి గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవువుతున్నాయి. కొడుకును సీఎం చేయాలనే ఆలోచనతోనే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టారని బండి సంజయ్ కామెంట్లు చేశారు. కేసీఆర్ తన పార్టీ పేరుకు అర్థం ఏంటో చెప్పాలని బండి సంజయ్ కామెంట్లు చేయడం గమనార్హం.

సొంత విమానం కొనుగోలు చేసిన నేతలు ఇద్దరు మాత్రమే అని అందులో ఒకరు కేసీఆర్ అయితే మరొకరు కేఏ పాల్ అని బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్, కేఏ పాల్ పొత్తు పెట్టుకుంటారేమో అని బండి సంజయ్ కామెంట్లు చేయడం గమనార్హం. అయితే బండి సంజయ్ కామెంట్ల గురించి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కేసీఆర్ కొత్త పార్టీ గురించి ఏపీ వైసీపీ నేతలు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కేసీఆర్ పీఎం అయితే కేటీఆర్ సీఎం కావాలని భావిస్తున్నారని కొత్త పార్టీ వెనుక అసలు కథ ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజలు కేసీఆర్ ను అభిమానించిన స్థాయిలో కేటీఆర్ ను అభిమానించి గెలిపిస్తారా అనే ప్రశ్నలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీ పేరును మార్చడం విషయంలో తెలంగాణ ప్రజలు ఏ మాత్రం సంతృప్తిగా లేరు.

తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన పార్టీ టీ.ఆర్.ఎస్ అని ఇప్పుడు పార్టీ పేరు మార్చి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ తన కామెంట్లతో తెలంగాణ ప్రజలను కూల్ చేస్తారేమో చూడాలి.