Unstoppable Season 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 డేట్ ఫిక్స్?

Unstoppable Season 2: తెలుగు ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే షో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించాడు. బాలకృష్ణ మొదటి సారిగా ఇలా ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ షో లో పాల్గొన్న సెలబ్రిటీలను బాలకృష్ణ తన ప్రశ్నలతో సందించగా.. వారు కూడా అంతే స్పోర్టివ్ గా బాలకృష్ణ ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఊహించని రీతిలో ఈ షో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ షో సీజన్ 2 గురించి కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడూ ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి.ఈ షో తొందరలోనే ప్రారంభం కానుంది. అయితే సీజన్ 2 లో బాలకృష్ణతో కాకుండా వేరెవరితో అయినా ‘అన్ స్టాపబుల్ షో’ చేస్తారేమో అనే అనుమానాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి శుక్రవారం ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రామ్ లో సమాధానం దొరికింది. శుక్రవారం ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో కి గెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ గారు ఈ విషయంపై స్పందించారు. ఈ షో చివరిలో తెలుగు ఇండియన్ ఐడల్ హోస్ట్శ్రీరామచంద్ర అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అంటూ బాలకృష్ణ ని అడిగాడు. ఈ ప్రశ్నకు బాలకృష్ణ బదులిస్తూ… ‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు… కొనసాగింపే’ అంటూ బదులిచ్చారు.

దీంతో ” అన్ స్టాపబుల్ షో సీజన్ 2 ” తొందరలోనే ప్రారంభం కానుంది. పైగా అందరు అనుమనపడినట్లు గా కాకుండా బాలకృష్ణ గారు ఈ షో ని కూడా హోస్ట్ చేయనున్నట్లు క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా ఈ”అన్ స్టాపబుల్ షో సీజన్ 2″ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.దీంతో ఈ దసరా పండుగకు బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా దసరా పండుగకి మంచి కనుక రానుంది . తెలుగు ఇండియన్ ఐడల్ సెమీస్ కు బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. ఈ షో గ్రాండ్ ఫైనల్స్ కు చిరంజీవి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడ నెట్టింట సందడి చేస్తున్నాయి.