Balakrishana: విలన్ పాత్రలకు ఓకే చెప్పిన బాలయ్య.. కానీ ఆ కండిషన్ తప్పనిసరి!

Balakrishana: నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎనర్జీ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం ఈ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. ఇలా వెండి తెరపై తిరుగులేని హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బాలకృష్ణ సినిమాలతో పాటు ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ అదిరిపోయే టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అఖండ చిత్రబృందం వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హీరో శ్రీకాంత్ దర్శకుడు బోయపాటి హీరోయిన్ లతో ఎంతో సరదాగా ముచ్చటిస్తూ ఎంతో ఎనర్జిటిక్ గా వారిని ఆటపట్టిస్తూ ఆద్యంతం ప్రేక్షకులను సందడి చేశారు.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ తనకు విలన్ గా నటించాలనే కోరిక ఉందని తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.అయితే తాను విలన్ గా నటించాలంటే ఒక కండిషన్ తప్పనిసరి అంటూ బాలయ్య తన కండిషన్ ఏంటో కూడా తెలియజేశారు.

బాలకృష్ణ విలన్ గా నటించడం కొత్తేమి కాదు ఆయన గతంలో నటించిన సుల్తాన్ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హీరో కూడా బాలకృష్ణ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఇకపై తనకు విలన్ గా అవకాశాలు వచ్చినా నటిస్తానని అయితే ఆ సినిమాలో హీరోగా తానే ఉండాలనే కండిషన్ పెట్టారు బాలయ్య. మరి ఈ నటసింహం కోరికనుతీర్చేలా ఏ డైరెక్టర్ ఇతనికి కథ సిద్ధం చేస్తారో తెలియాల్సి ఉంది.