Bhalakrishana: ఐ లవ్ యు అంటూ భార్యకు ప్రపోజ్ చేసిన బాలయ్య.. వసుంధర రియాక్షన్ ఇదే!

Bhalakrishana: నందమూరి బాలకృష్ణ ఆహాలో ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను ఆహ్వానించి తనదైన శైలిలో వారిని ప్రశ్నలు అడుగుతూ వారినుంచి ఎంతో విలువైన సమాచారాన్ని రాబడుతున్నారు. అదేవిధంగా వారితో సరదాగా జోకులు వేస్తూ ఎంతో చమత్కారం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చీరాగానే బాలకృష్ణ రానా పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ వస్తుందని ఎదురు చూశాము కానీ నీ పెళ్లి వార్త వచ్చింది అంటూ బాలకృష్ణ రానా పై సెటైర్ వేశారు. అలాగే పెళ్లికాకముందు పూలరంగడు మాదిరి తిరిగే వాడివి ఎంతమందికి హ్యాండ్ ఇచ్చావో, ఎంతమందికి నో చెప్పావో గూగుల్ చెబుతుంది అంటూ తనని ఆట పట్టించారు. పెళ్లయిన తర్వాత దారిలోకి వచ్చినట్లు ఉన్నావని బాలకృష్ణ రానా పై షాకింగ్ కామెంట్ చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రానా కొన్ని ప్రశ్నలను బాలకృష్ణ గారిని అడిగారు. ఆ ప్రశ్నలకు బాలకృష్ణ కూడా తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.ఇకపోతే రానా మీరెప్పుడైనా వసుంధర గారికి ప్రపోజ్ చేశారా అని ప్రశ్నించగా బాలకృష్ణ వెంటనే ఫోన్ తీసుకొని తన భార్యకు ఫోన్ చేసి వసు ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేశారు. దీంతో బాలకృష్ణ భార్య వసుంధర నాకు తెలుసు మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూ ఉంటారని సమాధానం చెప్పారు. అలాగే వీరిద్దరూ కలిసి ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ కూడా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.