దుమ్ము లేపేసిన బాలయ్య..పూనకాలు గ్యారెంటీ అంతే.!

మాస్ అనే పదం తోనే ఆడియెన్స్ అంతా కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. మరి అలాంటి మాస్ ఆడియెన్స్ ని ఒక ఊపు ఊపే హీరోల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. మరి ఈ మాస్ హీరో నటించిన లేటెస్ట్ సినిమానే “అఖండ”. బాలయ్యకి ఆస్థాన దర్శకునిగా మారిపోయిన బోయపాటి శ్రీను కోసం కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మాస్ ఆడియెన్స్ తో ఎలా ఆడుకోవాలో తనకి బాగా తెలుసు. మరి ఈ కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా అంటే మినిమమ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాని ప్లాన్ చేసారని విన్నాం ట్రైలర్ వరకు చూసాం. కానీ నిన్న రాత్రి రిలీజ్ చేసిన జై బాలయ్య సాంగ్ తో మాత్రం మాస్ ఆడియెన్స్ ని థియేటర్స్ లో పూనకాలు తెప్పించే పని చేశారు మేకర్స్.

https://www.youtube.com/watch?v=fHW8BjAK-2k

సాంగ్ లో బాలయ్య స్టెప్పులు అయితేనేంటి.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఏంటి అన్నీ దుమ్ము లేచిపోయాయి. దీనితో ఈ సాంగ్ చూసిన తర్వాత అంచనాలు లేని వారికీ కూడా ఆసక్తి పెరిగిపోయింది. ఇక సిల్వర్ స్క్రీన్ పై సినిమా చూడడం ఒక్కటే బాకీ ఉంది. అంతలా ఇప్పుడు సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.