Balayya : ఇన్సైడ్ టాక్ : బాలయ్య మాస్ బొమ్మ రీమేక్ కాదు అంటున్నారు కానీ అలా లేదుగా..?

Balayya : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా దింపి భారీ హైప్ ని ఈ సినిమా పై తీసుకొచ్చారు.

“అఖండ” లాంటి భారీ హిట్ అనంతరం ఆ క్రేజ్ కి తగ్గ రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాకి గాను షూట్ మొదలైన రోజే బాలయ్య లుక్ బయటకి రావడం ఆశ్చర్యంగా మారింది. అయితే ఇది కాస్తా కన్నడ సినిమా “మఫ్టి” రీమేక్ లా ఉందని టాక్ గట్టిగా స్ప్రెడ్ అయ్యింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ అయితే అసలు ఈ సినిమా ఏ ఇతర సినిమాకి కూడా రీమేక్ కాదని తెలుస్తుంది..కానీ మొన్న లీకైన స్టిల్ సీక్వెన్స్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ లో సీక్వెన్స్ లను చూసినా మళ్ళీ మఫ్టి లోని షేడ్స్ కనిపిస్తున్నాయని అభిమానులు కూడా ఒకింత చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.