Unstoppable With NBK: నా చేతిలో అయిపోయాడు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. ఎవరికో తెలుసా?

Unstoppable With NBK: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి అందరికి తెలిసిందే. బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర పై ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డైలాగులతో, డాన్స్ లతో వెండితెర ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ ప్రస్తుతం బుల్లితెర పై కూడా తనలోని మరొక టాలెంట్ ను బయట పెడుతూ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. తెలుగు ఓటిటి ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ఈ ప్రత్యేక టాక్ షో కీ మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎపిసోడ్ కీ ప్రేక్షకుల నుంచి భారీగానే స్పందన లభిస్తోంది.

ఇక బాలయ్య మాటలకు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, రాజమౌళి,బ్రహ్మానందం, రవితేజ, రానా, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఇలాంటి ప్రముఖులు వచ్చి సందడి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక తదుపరి ఎపిసోడ్ లో లైగర్ సినిమా టీమ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్,ఛార్మి లు నీచుడా సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వీడియోలో బాలయ్య మాట్లాడుతూ.. టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చుని.. నాలుగు ప్రశ్నలు అడిగి అవతలి వ్యక్తి తెలివిగా జవాబు చెబితే అవి వినడం వల్ల నావల్ల కాదని చెప్పాను.. అందుకు ఒక షరతు కూడా పెట్టాను.

వచ్చిన వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పాను.. ఆట మొదలు పెట్టిన అని అడగగా లైగర్ టీమ్ కూడా అందుకు ఓకే అని చెప్పారు. ఈ సందర్భంగా విజయ్ ని ఒక స్టాండ్ కు వేలాడదీసిన శాండ్ బ్యాగ్ ను తన్నమని చెప్పగా విజయ్ గట్టిగా తన్నడంతో అది చివరి వరకు వెళ్లి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. అప్పుడు వెంటనే బాలకృష్ణ తాను నటించిన మొదటి సినిమా ఏది అని ప్రశ్నించగా? విజయ్ ఆలోచిస్తున్నారు. ఇంతలో ఆ షోకీ వచ్చిన అభిమానుల్లో ఒక అతను తాతమ్మకల అని సమాధానం చెప్పగా.. వెంటనే బాలకృష్ణ వాడు నా చేతిలో అయిపోయాడు కదా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.