అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి హింట్ ఇచ్చిన బాలయ్య.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ చెప్పే డైలాగులకి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇంతకాలం యాక్షన్ సినిమాలతో అలరించిన బాలకృష్ణ ఇటీవల హోస్ట్ గా కూడా ప్రేక్షకులని అలరించాడు. యాక్షన్ హీరోగా ఇంత కాలం వెండితెర మీద సందడి చేసిన బాలకృష్ణ ఇటీవల ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే షో ద్వారా డిజిటల్ స్క్రీన్ లో తన సత్తా చాటుకున్నాడు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది.

ఆహా లో స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ షో ఓటీటీ షోల్లోనే నెంబర్‌ 1 షోగా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ హుషారుకే కేరాఫ్ అడ్రస్ కే నిలుస్తున్నారు. బాలకృష్ణ ఈ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా అన్‌ లిమిటెడ్‌ ఫన్‌ ను కూడా ప్రేక్షకులకి అందిస్తున్నాడు. ఇటీవల ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో కి గెస్ట్ గా వెళ్ళిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో తెలుగు ఇండియన్ ఐడల్ షో లో యాంకర్ శ్రీరామ చంద్ర అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి అడగగా..మెమరీస్‌ క్రియేట్‌ చేయడానికి మళ్లీ తప్పకుండా వస్తున్నామంటూ హింట్ ఇచ్చాడు.

ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 2 గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. తొందర్లోనే ఈ షో
మొదలుకాన్నట్టు ఆహా వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆహా ద్వారా బాలకృష్ణ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయటానికి సిద్దమవుతున్నాడు. ఈ సారి ఈ షో లో ఎవరెవరు గెస్ట్ లుగా వస్తారు అంటూ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఇటీవల అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.