ఓకే టైటిల్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన బాలయ్య, శోభన్ బాబు.. ఎవరు హిట్ కొట్టారో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకే కథాంశంతో రెండు విభిన్న టైటిల్ ద్వారా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అదే విధంగా ఒకే టైటిల్ తో రెండు సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఒక్క సినిమా హిట్ కావచ్చు మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ కావచ్చు. ఈ విధంగా గతంలో స్టార్ హీరోలు ఒకే టైటిల్ తో బాక్సాఫీస్ బరిలో దిగి మంచి విషయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి నట సింహం బాలకృష్ణ శోభన్ బాబు ఇద్దరు కూడా ఒకే సినిమాతో టైటిల్ తో కొన్ని సంవత్సరాల ఏడబాటుతో బాక్సాఫీసు బరిలో దిగారు. మరి ఈ పోటీలో ఎవరు తట్టుకున్నారు. ఎవరు చతికిల పడ్డారు అనే విషయానికి వస్తే…

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన శోభన్ బాబు 1970 లో తల్లిదండ్రులు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో శోభన్ బాబు సరసన చంద్రకళ హీరోయిన్ పాత్రలో నటించారు. అప్పట్లో శోభన్ బాబుకు తల్లిదండ్రుల పాత్రలో మహానటి సావిత్రి, జగ్గయ్య నటించారు. అప్పట్లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఇదే సినిమా టైటిల్ తో 1991 బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో తల్లిదండ్రులు అనే సినిమా విడుదలైంది.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ విధంగా ఒకే టైటిల్ తో రెండు సినిమాలు వచ్చినప్పటికీ శోభన్ బాబు సినిమా హిట్ కొట్ట లేకపోయినా, బాలకృష్ణ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో నిలబడి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.