Big Boss Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్న బాలకృష్ణ.. నాగార్జున పక్కన పెట్టినట్లేనా?

Big Boss Telugu: బుల్లితెర ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే 5 వ సీజన్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం చివరిలో నాగార్జున తదుపరి సీజన్ గురించి హింట్ ఇచ్చారు. త్వరలోనే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ సిక్స్ ప్రసారం అవుతుందని తెలిపారు. గత సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ వరెస్ట్ గా ఉందని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ కార్యక్రమం గురించి పెదవి విరుస్తున్నారు. అందుకు గల కారణం కంటెస్టెంట్ వ్యవహారశైలి అలాగే హోస్ట్ నాగార్జున ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు.

ఇలా ఎన్నో వివాదాల నడుమ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన తర్వాత సీజన్ సిక్స్ ప్రారంభమవడానికి సుమారు ఐదారు నెలల సమయం పడుతుంది. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు రెండు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ బుల్లితెరపై కాకుండా ఓటీటీ లో బిగ్ బాస్ సీజన్ 1 గా ప్రసారం కాబోతుంది అని సమాచారం. ఇలా ఓటీటీలో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది.

ఇలా నాగార్జున స్థానంలో బాలకృష్ణను దింపడానికి కారణం గత సీజన్లో ఆయన హోస్టింగ్ చేసిన విధానం పై ప్రతి ఒక్క ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేశారు. అందుకోసమే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ సరైన దారిలో పెట్టడానికి బాలక్రిష్ణ సరైన హోస్ట్ అంటూ అందుకోసమే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ త్వరలోనే బిగ్ బాస్ హోస్ట్ గా మారనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వేచి ఉండాలి.