Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్…. ఎదురుచూపులు తప్పవా?

Mokshagna: నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే బాలయ్య తర్వాతి తరంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వారు ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాలయ్య అసలు వారసుడిగా మోక్షజ్ఞ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా చాలా ఆలస్యమైంది. అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉండబోతుందని ప్రకటించారు.

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతాయని అందరూ భావించరు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించి వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అనుకోని విధంగా ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు రాకపోగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకోకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ భావించారు.

ఈ సినిమా ఆగిపోలేదని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కుమారుడు ఆకీర డెబ్యూ మూవీ గురించి ప్రశ్నించడంతో వెంటనే రామ్ చరణ్ సైతం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ప్రశ్నించారు.

ఇలా రామ్ చరణ్ అడగడంతో వెంటనే బాలయ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోవడమే కాకుండా త్వరలోనే ఉంటుంది అంటూ సమాధానం ముగించారు. ఒకవేళ నిజంగానే ఈ సినిమా ఉంటే సినిమాకి సంబంధించి మరికొన్ని విషయాలు చెప్పేవారు కానీ అలాంటి విషయాలను ప్రస్తావించకపోవడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మళ్లీ మొదటికే వచ్చిందని, మోక్షజ్ఞ రాక కోసం అభిమానులు ఇంకా ఎదురుచూడాల్సిందేనని పలువురు నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.